BJP Leaders: సీఎం కేసీఆర్‌పై తమదైన స్టైల్లో బీజేపీ నేతల కౌంటర్లు

BJP Leaders: జనవరిలోపు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్...

Shireesha
Updated on: 28 Dec 2021 8:30 AM IST
BJP Leaders Counters on CM KCR at Nirudyoga Deeksha on Job Notifications in Telangana | Live News
X

BJP Leaders: సీఎం కేసీఆర్‌పై తమదైన స్టైల్లో బీజేపీ నేతల కౌంటర్లు

BJP Leaders: తెలంగాణ బీజేపీ బెంగాల్ త‌ర‌హాలో అధికార పార్టీపై పోరాటానికి సిద్ధమవుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టాలంటే బెంగాల్ క‌మ‌లం పార్టీ వ్యూహాలను ఫాలో అవ్వాలని తెలంగాణ బీజేపీ పిలుపునిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి రావ‌డానికి బెంగాల్ త‌ర‌హాలో కార్యకర్తలు త్యాగాలు చేయ‌డానికి సిద్ధం కావాల‌ని ఆపార్టీ అధ్యక్షుడు బండిసంజ‌య్ పిలుపునిచ్చారు. నిరుద్యోగ‌దీక్ష ముగింపు వేదికపై బండి సంజయ్‌ వ్యాఖ‌్యల వెనుక ఆంతర్యం ఏంటి?

తెలంగాణ బీజేపీలో నిరుద్యోగ దీక్ష కొత్త జోష్ నింపింది. అనుకున్న ప్రకారమే బీజేపీ నిరుద్యోగ దీక్షకు భారీ ఏర్పాట్లు చేసింది. ముందస్తు అరెస్టులు చేసినా.. పార్టీ అంచ‌నా ప్రకారం కార్యకర్తలు భారీగా కదిలివచ్చారు. వ‌చ్చే జ‌న‌వరిలోపు ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌క‌పోతే అసెంబ్లీ స‌మావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే వరకు త‌మ పోరాటం ఆగ‌ద‌న్నారు.

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి , ఎంపీ అర్వింద్ ఎవ‌రి స్టైల్ వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నిక‌ల్లో హామీలు ఇవ్వడం తర్వాత మర్చిపోవడంలో సీఎం కేసీఆర్ దిట్ట అంటూ ఆరోపించారు. ఆయ‌న కేవ‌లం కుటుంబం కోసం మాత్రమే ఆలోచించే నాయ‌కుడ‌ని విమ‌ర్శించారు.

Shireesha

Shireesha

Next Story