గద్దర్‌ మావోయిస్టు.. పద్మ అవార్డు ఎలా ఇస్తాం? కాంగ్రెస్ నేతలపై విష్ణువర్థన్ రెడ్డి ఫైర్

గద్దర్‌ మావోయిస్టు.. పద్మ అవార్డు ఎలా ఇస్తాం? కాంగ్రెస్ నేతలపై విష్ణువర్థన్ రెడ్డి ఫైర్
x

గద్దర్‌ మావోయిస్టు.. పద్మ అవార్డు ఎలా ఇస్తాం? కాంగ్రెస్ నేతలపై విష్ణువర్థన్ రెడ్డి ఫైర్

Highlights

పద్మ అవార్డ్స్‌ విషయం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజా గాయకుడు దివంగత గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ కేంద్రానికి సిఫారసు చేసింది.

Vishnuvardhan Reddy: పద్మ అవార్డ్స్‌ విషయం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజా గాయకుడు దివంగత గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ ప్రభుత్వం పంపించిన సిఫారసును కేంద్రం తిరస్కరించింది. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్.. గద్దర్‌ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా గద్దర్‌ను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేతల తీరుపై ఆయా వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.

గద్దర్‌కు పద్మ అవార్డ్ ఇవ్వకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరుకు బీజేపీ లీడర్లు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి.. గద్దర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌ను ఎల్‌టీటీ ప్రభాకరన్, గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో పోల్చారు. రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గద్దర్ మావోయిస్టులకు నాయకుడని.. ఆయన కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నారని.. గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలా అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీని చంపిన వారికి పద్మ పురస్కారం ఇవ్వమంటారా అంటూ కాంగ్రెస్ నేతలను నిలదీశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పద్మ అవార్డుల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ గురించి తెలియని వాళ్లే రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నట్టుగా ఉందన్నారు విష్ణువర్థన్ రెడ్డి.

ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న కేంద్రమంత్రి బండి సంజయ్.. గద్దర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లతో కలిసి గద్దర్ అనేకమంది బీజేపీ కార్యకర్తలను హత్య చేయించాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఇవ్వాలని లేఖ రాయడం సరికాదన్నారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకివ్వాలి బరాబర్ ఇవ్వం అంటూ కుండబద్దలు కొట్టినట్టి చెప్పారు.

అయితే బీజేపీ నేతల తీరుపై సోషల్ మీడియా వేదిక పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మందకృష్ణ మాదిగ మాజీ నక్సలైట్ కాదా అతనికి ఎలా అవార్డు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు... ఈటల రాజేందర్ నక్సలైట్ కాదా అతనికి బీజేపీ ఎంపీ సీటు ఎలా ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇవి బీజేపీ ఇచ్చే అవార్డ్స్ కాదని.. కేంద్రం ఇచ్చే అవార్డ్స్ అంటూ మండిపడుతున్నారు. ప్రతిభకు తార్కాణంగా చెప్పుకునే పద్మ అవార్డ్స్‌ను రాజకీయం చేయొద్దని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories