సీఎం కేసీఆర్‌కు తరుణ్‌ చుగ్ సవాల్.. కేసీఆర్ ఇంట్లో మాత్రమే..

Tarun Chugh: ఉద్యోగాలపై సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్ చుగ్.

Arun Chilukuri
Updated on: 27 Dec 2021 4:48 PM IST
BJP Leader Tarun Chugh Open Challenge to CM KCR
X

సీఎం కేసీఆర్‌కు తరుణ్‌ చుగ్ సవాల్.. కేసీఆర్ ఇంట్లో మాత్రమే..

Tarun Chugh: ఉద్యోగాలపై సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్ చుగ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం సీఎం కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని నిరుద్యోగ దీక్షలో విమర్శించారు. నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రం కోసం పోరాడిన యువతను మర్చిపోయారని, తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన యువతకు ఎలాంటి లాభం చేకూరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ ప్రజల్ని కాకుండా పోలీసుల్ని నమ్ముకొన్నారని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story