దుబ్బాక ఫలితాలపై బీజేపీ నేత రాంమాధవ్ ట్వీట్

Arun Chilukuri
Published on: 10 Nov 2020 10:21 AM IST
దుబ్బాక ఫలితాలపై బీజేపీ నేత రాంమాధవ్ ట్వీట్
X

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత రాంమాధవ్ ట్వీట్ చేశారు. దుబ్బాకలో ఆసక్తికర పోరు జరుగుతోందని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య అసలైన పోరు జరుగుతోందని ట్వీట్ లో పేర్కొన్నారు. తమ పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉందని, బీజేపీ అనూహ్య విజయం సాధించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన మూడు రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. దుబ్బాక ఉపఎన్నిక మూడో రౌండ్‌ల కౌంటింగ్‌ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘనందన్‌ రావు ఇప్పటిదాకా 1885 ఓట్ల ఆధిక్యం సాధించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story