Khammam: అధికారంలోకి వస్తే ఖమ్మం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం- పురందేశ్వరి

Khammam: ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల బీజేపీ మ్యానిఫెస్టో‌ను జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి విడుదల చేశారు.

Arun Chilukuri
Published on: 26 April 2021 5:23 PM IST
BJP Leader Purandeswari Municipal Election Campaign At Khammam
X

Khammam: అధికారంలోకి వస్తే ఖమ్మం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం- పురందేశ్వరి

Khammam: ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల బీజేపీ మ్యానిఫెస్టో‌ను జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం పేరును వేసుకుంటుందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ అన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడం, ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఖమ్మం నగరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. నగరాన్ని ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story