Huzurabad: హుజూరాబాద్‌లో చర్చనీయాంశంగా మారిన పెద్దిరెడ్డి పర్యటన

Huzurabad: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

Arun Chilukuri
Updated on: 16 Jun 2021 12:58 PM IST
BJP Leader Peddireddy Tour in Huzurabad
X

Huzurabad: హుజూరాబాద్‌లో చర్చనీయాంశంగా మారిన పెద్దిరెడ్డి పర్యటన

Huzurabad: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత, పెద్దిరెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మృతి చెందిన దగ్గరి మిత్రుల కుటుంబాలను పెద్దిరెడ్డి పరామర్శించనున్నారు. అనంతరం తన అనుచరులతో సమావేశం కానున్నారు. అయితే, గత రెండు రోజుల క్రితమే ఈటల బీజేపీలో చేరారు. ఆయన హుజూరాబాద్‌ నుంచి బీజేపీ తరపున పోటీ చేయనున్నారని ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో పెద్దిరెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం ఇప్పుడు సర్కాత్రా ఉత్కంఠను రేపుతోంది.

ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే, తాను మద్దతు ఇవ్వనని ఇటీవల పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల పార్టీలో చేరడంపై, తనను ఎవరు సంప్రదించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత, పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పెద్దిరెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేయాలని భావించిన పెద్దిరెడ్డికి ఈటల రాకతో నిరాశ ఎదురైంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story