Telangana: రైతులు పసుపు బోర్డు కావాలంటే తీసుకోస్తాం- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Telangana: కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. రైతులు పసుపు బోర్డు కావాలంటే కేంద్రం దగ్గర మాట్లాడి తీసుకొస్తామన్నారు.

Arun Chilukuri
Published on: 28 March 2021 4:01 PM IST
BJP Leader NVSS Prabhakar Slams TRS, Congress Leaders
X

Telangana: రైతులు పసుపు బోర్డు కావాలంటే తీసుకోస్తాం- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Telangana: కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. రైతులు పసుపు బోర్డు కావాలంటే కేంద్రం దగ్గర మాట్లాడి తీసుకొస్తామన్నారు. రెండు పార్టీలు అవకాశవాద, హత్యారాజకీయాలు చేస్తూ భౌతిక దాడులు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారనన్నారు. జానారెడ్డి ఓటర్లను కలవకుండానే గెలుస్తానంటున్నారు.

ఎమ్మెల్సీ కవితను ప్రసన్నం చేసుకునేందుకే కాంగ్రెస్ నేతలు పార్లమెంట్‌లో పసుపు బోర్డు అంశం లేవనెత్తారన్నారు. రాజశేఖర్ రెడ్డి పసుపు బోర్డును ఎందుకు తేలేదని, ఆయన కనీసం దీనిపై ఎప్పడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. డీఎస్ చెప్పిన వైఎస్ వినలేదన్నారు. ఈ విషయం షర్మిలకు తెలియదనుకుంటానని అన్నారు. షర్మిళ సభకు కేసీఆర్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చినందుకే షర్మిళ పసుపు బోర్డు అంటోందని ఫైర్‌ అయ్యారు. స్పైసెస్ రీజనల్ ఎక్స్ టెన్షన్ బోర్డ్ తో పసుపు కు మంచి ధర వస్తుందని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story