Top
logo

కేసీఆర్‌కు కుటుంబంపై ఉన్న శ్రద్ధ విద్యా విధానంపై లేదు : మురళీధర్‌రావు

కేసీఆర్‌కు కుటుంబంపై ఉన్న శ్రద్ధ విద్యా విధానంపై లేదు : మురళీధర్‌రావు
X
Highlights

BJP Leader Muralidhar Rao: తెలంగాణలో విద్యావ్యవస్థ అంధకారమైందని బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు అన్నారు. సీఎం ...

BJP Leader Muralidhar Rao: తెలంగాణలో విద్యావ్యవస్థ అంధకారమైందని బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌కు కుటుంబం మీద ఉన్న శ్రద్ధ. విద్యా వ్యవస్థపై లేదని ఎద్దెవా చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ మంత్రి పదవీ లేకుండా ఉండరని విమర్శించారు. తెలంగాణలో యూనివర్సిటీలకు వీసీలను నియమించడం లేదని మురళీధర్‌రావు విమర్శించారు. తెలంగాణలో సరస్వతీ దేవి చీకట్లో మగ్గుతుందన్నారు. ఖాళీల భర్తీ కోసం డిమాండ్‌ చేయాలని ఉద్యోగ సంఘాలకు సూచించారు. తెలంగాణలో విద్యా విధానం బాగుపడాలంటే అది బీజేపీతోనే సాధ్యమని మురళీధర్‌రావు చెప్పారు.


Web TitleBJP Leader Muralidhar Rao Slams CM KCR Over Education System In Telangana
Next Story