Coronavirus: మున్సిపల్ ఎన్నికలపై టీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలి- లక్ష్మణ్‌

Coronavirus: టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి ఎన్నిలపై ఉన్న దృష్టి కరోనా కట్టడిపై లేదని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 21 April 2021 5:39 PM IST
BJP Leader Laxman Slams TRS Government In Press Meet
X

Coronavirus: మున్సిపల్ ఎన్నికలపై టీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలి- లక్ష్మణ్‌

Coronavirus: టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి ఎన్నిలపై ఉన్న దృష్టి కరోనా కట్టడిపై లేదని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు భారీగా పెరిగాయని విమర్శించారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం బాధ్యతయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇక రానున్న మున్సిపల్‌ ఎన్నికలపై టీఆర్ఎస్‌ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు బీజేపీ సిద్ధంగానే ఉంది కానీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాయిదా కోరుతున్నామన్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పరిస్థితులపై వెంటనే స్పందించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story