కేటీఆర్‌ మీ పేరును తుపాకీరావుగా మార్చుకోండి.. సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మణ్..

Laxman: తెలంగాణలో చైనా మాదిరిగా రాజ్యాంగాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని...

Arun Chilukuri
Published on: 19 Feb 2022 7:26 PM IST
BJP Leader Laxman Slams cm KCR and KTR
X

కేటీఆర్‌ మీ పేరును తుపాకీరావుగా మార్చుకోండి.. సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మణ్..

Laxman: తెలంగాణలో చైనా మాదిరిగా రాజ్యాంగాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. తెలంగాణలో జీవితాంతం కల్వకుంట్ల కుటుంబం పరిపాలించేలా కేసీఆర్ సరికొత్త కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఓ నియంతలా ప్రవర్తిస్తూ పరిపాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మణ్. రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి తన పేరును తారక రామారావుకు బదులుగా తుపాకీరావుగా మార్చుకోవాలని లక్ష్మణ్ అన్నారు. నైరాశ్యంతోనే ప్రధాని మోదీపై కేటీఆర్‌ విమర్శలు చేస్తున్నారని చురకలంటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story