Etela Rajender: మెడలో టీఆర్ఎస్ కండువా ఉంటేనే పథకాలు

Etela Rajender: మూడు నెలలుగా హుజూరాబాద్‌లో చీకటి అధ్యాయం నెలకొందని ఈటల రాజేందర్ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 15 Aug 2021 7:25 PM IST
BJP Leader Etela Rajender Slams CM KCR
X

Etela Rajender: మెడలో టీఆర్ఎస్ కండువా ఉంటేనే పథకాలు

Etela Rajender: మూడు నెలలుగా హుజూరాబాద్‌లో చీకటి అధ్యాయం నెలకొందని ఈటల రాజేందర్ ఆరోపించారు. జమ్మికుంటలో పర్యటించిన ఈటల బీజేపీ నాయకులు, కార్యకర్తల ఫోన్లు ట్యాప్ చేస్తూ వారి కదలికలపై నిఘా పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు.

మెడలో టీఆరెఎస్ కండువా, ఇంటి మీద జెండా ఎగిరితేనే ప్రభుత్వ పథకాలు వస్తాయంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తల్ని, ఇతర సంఘాల నాయకులను అరెస్ట్ చేస్తున్నారని, స్టేషన్లలో చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై రేపు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story