DK Aruna: ఆత్మగౌరవం విజయం సాధించింది

DK Aruna: తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ప్రారంభం అయ్యిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

Arun Chilukuri
Updated on: 2 Nov 2021 2:26 PM IST
BJP Leader DK Aruna Comments on Huzurabad By-Election Result
X

DK Aruna: ఆత్మగౌరవం విజయం సాధించింది

DK Aruna - Huzurabad By-Election Result 2021: తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ప్రారంభం అయ్యిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆత్మగౌరవం విజయం సాధించిందన్నారు. దళిత బందు పథకం లాంచ్ చేసిన గ్రామంలోనూ బీజేపీ ముందంజలో ఉందని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని టీఆర్ఎస్ కోల్పోయిందని డీకే అరుణ అన్నారు.

ఎన్నిక నేప‌థ్యంలో వేలకోట్ల రూపాయ‌ల‌ పథకాలకు జీఓలు ఇచ్చినా ప్రజలు నమ్మలేదని ఆమె విమ‌ర్శించారు. ఒక్కోఓటును 6 వేల నుంచి 10 వేలు రూపాయ‌లు పెట్టి కొనాల‌ని య‌త్నించిన‌ప్ప‌టికీ టీఆర్ఎస్ గెల‌వ‌లేద‌ని డీకే అరుణ అన్నారు. హుజూరాబాద్ ఓట‌ర్లు ఆత్మగౌరవం వైపే నిలబడ్డారని తెలిపారు. ఓట‌ర్ల‌కు తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story