logo
తెలంగాణ

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అరెస్ట్‌

BJP Leader Bodiga Shobha Arrest In Karimnagar
X

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అరెస్ట్‌

Highlights

Bodiga Shobha: బండి సంజయ్ జన జాగరణ దీక్ష కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

Bodiga Shobha: బండి సంజయ్ జన జాగరణ దీక్ష కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే బండి సంజయ్‌ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేయగా ఇవాళ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్‌ ఈనెల 3న చేపట్టిన జన జాగరణ దీక్ష సమయంలో నమోదైన కేసులో భాగంగా ఆమెను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 16మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు మరో 11 మందికోసం గాలిస్తున్నారు. ఈ కేసులో భాగంగా ఇప్పటికే బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. తాజాగా బొడిగె శోభను కూడా అరెస్ట్‌ చేశారు.

Web TitleBJP Leader Bodiga Shobha Arrest In Karimnagar
Next Story