Top
logo

పాతబస్తీపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

పాతబస్తీపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X
Highlights

పాతబస్తీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్ పీఠం బీజేపీకి దక్కితే పాతబస్తీపై ...

పాతబస్తీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్ పీఠం బీజేపీకి దక్కితే పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్‌ చేస్తామని ఆయన అన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్‌ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. హిందూధర్మం కోసం బీజేపీ అన్నివేళలా పనిచేస్తుందని స్పష్టం చేశారు బండి సంజయ్. మంగళవారం నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగం చేశారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Web TitleBJP Leader Bandi Sanjay sensational comments on the old city
Next Story