జనగామలో హై టెన్షన్: బీజేపీ కార్యకర్తలపై దాడిచేసిన సీఐపై చర్యలకు డిమాండ్

BJP leader Bandi Sanjay demands DGP to suspend Jangaon CI
జనగామలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేప...
జనగామలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. 24 గంటల డెడ్‌లైన్ ముగియడంతో అన్న మాట ప్రకారం జనగామకు చేరుకున్నారు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్. బీజేపీ కార్యకర్తల రక్తం కళ్ళ చూసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఉంచి, స్వామి వివేకానంద ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాక్షసపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని విమర్శించారు. ర్యాలీలో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.