విజయశాంతిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

X
Highlights
కాంగ్రెస్ నేత విజయశాంతి పార్టీ మార్పుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు....
Arun Chilukuri3 Nov 2020 9:33 AM GMT
కాంగ్రెస్ నేత విజయశాంతి పార్టీ మార్పుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముల్మమ్మపై పొగడ్తలు గుప్పించారు. విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలు అన్న బండి సంజయ్.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్నారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలను ఆమె చైతన్యం చేశారని కొనియాడారు. తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని బండి సంజయ్ పేర్కొన్నారు. రాములమ్మ బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం సాగుతున్న ఈ తరుణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
Web TitleBJP Leader Bandi Sanjay comments on Vijaya Shanthi
Next Story