Huzurabad By-Election Result: గెల్లుకు బిగ్ షాక్... సొంత గ్రామంలో కారు పంక్చర్‌..

BJP Lead in Himatnagar Village in Huzurabad By-Election Result 2021
x

Huzurabad By-Election Result: గెల్లుకు బిగ్ షాక్... సొంత గ్రామంలో కారు పంక్చర్‌.. 

Highlights

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడును ప్రదర్శిస్తోంది.

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడును ప్రదర్శిస్తోంది. ఈటల రాజేందర్‌ను ఢీకొట్టడంలో కారు పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ తడబడ్డట్టుగా తెలుస్తోంది. ఒక్క ఎనిమిదో రౌండ్‌ మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల స్పష్టమైన మెజార్టీని కొనసాగిస్తున్నారు. హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంతూరు హిమ్మత్‌ నగర్‌ లో దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు ఓటర్లు.

టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామమైన హిమ్మత్ నగర్ లో ఈట‌ల‌ రాజేందర్ కు 191 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎన్నో ఆశలతో టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన గెల్లుకు సొంతూరి ప్రజలే షాకివ్వడం ఈటల ప్రభంజనాన్ని తెలియజేస్తోంది. హిమ్మత్‌ నగర్‌ గ్రామంలో బీజేపీకి 548 రాగా, టీఆర్‌ఎస్‌కు 358 ఓట్లు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories