సీఎం కేసీఆర్‌ బిహార్‌ పర్యటనపై ఎంపీ లక్ష్మణ్‌ విమర్శలు

BJP Laxman: సీఎం కేసీఆర్‌ ఇంట గెలవకుండా రచ్చకెక్కుతున్నారు

Jyothi
Published on: 1 Sept 2022 1:51 PM IST
BJP Laxman Fires on CM KCR
X

సీఎం కేసీఆర్‌ బిహార్‌ పర్యటనపై ఎంపీ లక్ష్మణ్‌ విమర్శలు

BJP Laxman: సీఎం కేసీఆర్‌ బిహార్‌ పర్యటనపై ఎంపీ లక్ష్మణ్‌ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ ఇంట గెలవకుండా రచ్చకెక్కుతున్నారని.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. సాయం ముసుగులో బిహార్‌ వెళ్లి రాజకీయం చేస్తున్నారన్న లక్ష్మణ్... బిహార్‌లో జరిగింది అవకాశవాదుల సమావేశమంటూ మండిపడ్డారు. తెలంగాణలో చెల్లని రూపాయి..బిహార్‌లో, దేశంలో చెల్లుతుందా? అంటూ విమర్శించారు.

మునుగోడులో కేసీఆర్‌ ఎన్ని కోట్లు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని.. టీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారన్నారు. బావిలో కప్పలా కేవలం ప్రగతిభవన్‌కే కేసీఆర్‌ పరిమితమయ్యారని ఫైరయ్యారు ఎంపీ లక్ష్మణ్‌.


Jyothi

Jyothi

Next Story