Peddapalli: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో బీజేపీ..?

Peddapalli: బీజేపీలో చేరనున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత..?

Shashank Gullapelli
Published on: 17 April 2024 3:51 PM IST
BJP Is Thinking Of Changing Peddapalli MP Candidate..?
X

Peddapalli: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో బీజేపీ..?

Peddapalli: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత.. కమలం గూటికి చేరనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వెంకటేష్‌ నేత కాంగ్రెస్‌లో చేరారు. అయితే.. పెద్దపల్లి ఎంపీ టికెట్‌ దక్కకపోవడంతో ఆయన.. బీజేపీ గూటికి చేరుకోనున్నట్టు సమాచారం. మరోవైపు.. ఇప్పటికే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్‌ పేరును ఖరారు చేసింది కమలం పార్టీ. అయితే.. ఒకవేళ వెంకటేష్‌ నేత బీజేపీలో చేరితే.. పెద్దపల్లి ఎంపీ టికెట్‌ను ఆయనకే ఇచ్చే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story