Baithi Sridhar: బీజేపీ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

Baithi Sridhar: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు

Shekhar G
Published on: 2 Oct 2023 1:40 PM IST
BJP Is Not A Government Of Words But A Government Of Deeds Says Baithi Sridhar
X

Baithi Sridhar: బీజేపీ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

Baithi Sridhar: బీజేపీ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందని అన్నారు BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్‌. మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో మోడీ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీజేపీకి ఎవరూ పోటీరాలేరన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కూడా ఆమోదం లభించిందని గుర్తుచేశారు. ఇక.. మోడీని ప్రపంచ దేశాలు అభినందిస్తుంటే.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ మాత్రం విమర్శిస్తున్నారని ఫైర్‌ అయ్యారు బైతి శ్రీధర్‌. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన బైతి శ్రీధర్‌.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Shekhar G

Shekhar G

Next Story