Bandi Sanjay: బీజేపీ కార్యకర్తలకు హ్యాట్సాఫ్..ఎమ్మెల్యేగా ఈటల అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం

Bandi Sanjay: హుజూరాబాద్ లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

Arun Chilukuri
Updated on: 2 Nov 2021 12:52 PM IST
BJP Huge Victory in Huzurabad Says Bandi Sanjay
X

Bandi Sanjay: బీజేపీ కార్యకర్తలకు హ్యాట్సాఫ్.. ఎమ్మెల్యేగా ఈటల అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం

Bandi Sanjay - Huzurabad By Election Result 2021: హుజూరాబాద్ లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గెలిచేది బీజేపీనే అని తాము ముందు నుంచే చెపుతున్నామన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ విజయం సాధించడం ఖాయమని, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడని, ఈటల గెలుపు బీజేపీ గెలుపని, బీజేపీ గెలుపు ఈటల గెలుపేనని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పై ప్రజలకు విశ్వాసం లేదని, దళిత బంధు అమలు చేసినా ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. డబ్బును కాదని చైతన్యాన్ని చాటిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. టీఆర్ఎస్‌తో విరోచిత పోరాటం చేసిన బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ హ్యాట్సాఫ్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story