Etela Rajender: ఈటల చేరికకు బీజేపీ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ?

Etela Rajender: మాజీమంత్రి ఈటల చేరికకు బీజేపీ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Arun Chilukuri
Updated on: 27 May 2021 5:17 PM IST
BJP High Command Gives Green Signal to Etela Rajender
X

ఈటల రాజేందర్‌(ఫైల్ ఇమేజ్ )

Etela Rajender: మాజీమంత్రి ఈటల చేరికకు బీజేపీ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం బీజేపీ జాతీయ నేతలతో ఈటల విషయమై బండి సంజయ్‌ చర్చించినట్టు సమాచారం. దీంతో బీజేపీలో చేరేందుకు ఈటల అంగీకరించినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఈ నెల 30కి ఏడేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యంలో అదేరోజు ఈటల బీజేపీలో చేరుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజున బీజేపీలో ఈటల చేరే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story