BJP Sabha: నిర్మల్‌ జిల్లా భైంసాలో బీజేపీ భారీ బహిరంగ సభ

BJP Held a Huge Public Meeting in Bhainsa of Nirmal
x

BJP Sabha: నిర్మల్‌ జిల్లా భైంసాలో బీజేపీ భారీ బహిరంగ సభ

Highlights

BJP Sabha: హైకోర్టు ఆదేశాలతో సభా వేదికను మార్చిన బీజేపీ నాయకులు

BJP Sabha: నిర్మల్‌ జిల్లా భైంసాలో ఇవాళ జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలతో సభా వేదికను బీజేపీ నాయకులు మార్చారు. భైంసా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాటేగావ్‌ వద్ద సభను ఏర్పాటు చేశారు. అయితే.. బీజేపీ బహిరంగ సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. 3 వేల మందితో సభను నిర్వహించాలని ఆదేశించింది. అలాగే బండి సంజయ్‌ పాదయాత్రలోనూ 5వందల మంది మాత్రమే పాల్గొనాలని ఆంక్షలు విధించింది. అటు.. భైంసాలో 3 వందల మందితో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ అనంతరం.. బండి సంజయ్‌ రెండోరోజు పాదయాత్ర ప్రారంభం కానుంది. భైంసా, కుంటాల మండలాల్లో ఈ పాదయాత్ర జరగనుంది. ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావుతో పాటు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories