Telangana Elections: బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డికి హెలికాప్టర్లు.. ఎన్నికలకు BJP మాస్టర్ ప్లాన్!

Telangana Election Campaign: తెలంగాణలో ఎన్నికల దగ్గరపడుతున్నకొద్దీ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

Arun Chilukuri
Published on: 2 Nov 2023 3:03 PM IST
BJP Gives Helicopters to Bandi Sanjay and Kishan Reddy
X

Telangana Elections: బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డికి హెలికాప్టర్లు.. ఎన్నికలకు BJP మాస్టర్ ప్లాన్!

Telangana Election Campaign: తెలంగాణలో ఎన్నికల దగ్గరపడుతున్నకొద్దీ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రోజుకు మూడు చొప్పున బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగ సభలు, రాహుల్, ఖర్గేలతో కార్నర్ మీటింగ్‌లో సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేయనుంది.

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారపర్వంలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి మూడు హెలికాప్టర్లను సమకూర్చింది. ఒకటి పూర్తిగా బండి సంజయ్‌కు కేటాయించగా.. మరో రెండు కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, ముఖ్య నేతల ప్రచారానికి వినియోగించనున్నట్లు సమాచారం. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ను ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story