ఎమ్మెల్యే జోగు రామన్న తీరుపై బీజేపీ గిరిజన మోర్చా నాయకులు ఫైర్‌

*ఎంపీ సోయంబాపురావుపై ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను.. *ఖండిస్తూ జిల్లా కేంద్రంలో నిరసన, ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దగ్ధం *ఎంపీకి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేసిన నాయకులు

Arun Chilukuri
Updated on: 30 Jan 2021 3:45 PM IST
ఎమ్మెల్యే జోగు రామన్న తీరుపై బీజేపీ గిరిజన మోర్చా నాయకులు ఫైర్‌
X

ఎమ్మెల్యే జోగు రామన్న తీరుపై బీజేపీ గిరిజన మోర్చా నాయకులు ఫైర్‌

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న తీరుపై బీజేపీ గిరిజన మోర్చా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ సోయం బాపురావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా.. తెలంగాణ చౌక్‌లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 24గంటల్లో ఎంపీకి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు పెడతామంటూ హెచ్చరించారు. అదేవిధంగా గిరిజన గ్రామాలలో జోగురామన్నను రానివ్వబోమని అల్టిమేటం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story