BJP: మిషన్ 90లో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీజేపీ ఫోకస్‌

BJP: తెలంగాణ బూత్‌ స్థాయి సమ్మేళనానికి సర్వం సిద్ధం

Jyothi
Updated on: 7 Jan 2023 12:57 PM IST
BJP Focus on Party organizational Structure as Part of Mission 90
X

BJP: మిషన్ 90లో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీజేపీ ఫోకస్‌

BJP: మిషన్ 90లో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీజేపీ ఫోకస్‌ పెట్టింది. తెలంగాణ బూత్‌ స్థాయి సమ్మేళనానికి సర్వం సిద్ధం చేసింది. సంఘటన మహావిస్తార్ అభియాన్‌కు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సరళ్‌ యాప్‌ను రూపొందించింది. సరళ్‌ యాప్‌తో గుజరాత్‌, బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లో మంచి ఫలితాలు రావడంతో.. తెలంగాణలోనూ దానిని ప్రయోగించాలని చూస్తోంది. ఇక.. ఈ సమ్మేళనంలో బండి సంజయ్‌, సునీల్‌ బన్సల్‌, తరుణ్‌చుగ్‌ పాల్గొననున్నారు. వర్చువల్‌గా పాల్గొని సరళ్‌ యాప్‌ను జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బూత్‌ కమిటీ సభ్యుల సమ్మేళనం కోసం అన్ని నియోజకవర్గాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు కమలనాథులు. ఫిబ్రవరి మెదటి వారం లోపు 35 వేల 400 బూత్ కమిటీలను వంద శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తోంది.

Jyothi

Jyothi

Next Story