BJP: టార్గెట్ లోక్‌సభ.. 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి ఇంచార్జ్‌లుగా బాధ్యతలు

BJP Focus On Parliament Elections
x

BJP: టార్గెట్ లోక్‌సభ.. 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి ఇంచార్జ్‌లుగా బాధ్యతలు

Highlights

BJP: హైదరాబాద్ ఇంచార్జ్‌గా గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్‌కు బాధ్యత

BJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. రానున్న ఎంపీ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించింది బీజేపీ అధిష్టానం. 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి ఇంచార్జ్‌లుగా బాధ్యతలను అప్పగించింది. హైదరాబాద్ ఇంచార్జ్‌గా గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్‌కు బాధ్యతను కేటాయించగా... కరీంనగర్ ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి, సికింద్రాబాద్‌ బాధ్యత కే. లక్ష్మణ్‌కు, ఆదిలాబాద్‌ పాయల్ శంకర్‌కు అప్పగించింది.

పెద్దపల్లి - రమారావు పాటిల్, జహీరాబాద్ - కాటిపల్లి వెంకటరమణరెడ్డి, మెదక్ - పాల్వాయి హరీష్ బాబు, మల్కాజ్‌గిరి - పైడి రాకేష్ రెడ్డి, చేవెళ్ళ - ఏవీఎన్ రెడ్డి, మహబూబ్‌నగర్ - రామచంద్రరావు, నాగర్‌కర్నూల్ - మాగం రంగారెడ్డి, నల్లగొండ - చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్ - గరికపాటి మోహనరావు, ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ.. ఆదేశాలు జారీ చేసిది.

Show Full Article
Print Article
Next Story
More Stories