logo
తెలంగాణ

ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..

BJP Fale on Operation Aakash in Telangana
X

ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..

Highlights

Operation Aakash: గులాబీ దళానికి వణుకు పుట్టిస్తామని చేస్తున్న బీజేపీ నేతల ప్రకటనలు వట్టి మాటలేనా?

Operation Aakash: గులాబీ దళానికి వణుకు పుట్టిస్తామని చేస్తున్న బీజేపీ నేతల ప్రకటనలు వట్టి మాటలేనా? టీఆర్ఎస్ అసంతృప్తులకు కమలం కండువాలు కప్పడంలో బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు, అలసత్వం మొదటికే మోసం తెస్తుందా? టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు ఏం జరిగింది? బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగిన నల్లాల ఓదెలు ఉన్నట్లుండి కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో ఎందుకు చేరాల్సివచ్చింది? ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగంలో కాంగ్రెస్ కంటే బీజేపీ వెనకబడి పోయిందా?

రాహుల్‌గాంధీ వరంగల్ సభ తర్వాత కాంగ్రెస్‌కు మళ్లీ జోష్ వచ్చిందనే ప్రచారం గులాబీదళంలోని అసంతృప్త నేతలను హస్తం వైపు వెళ్లేలా చేస్తోందా? డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని స్పీచ్‌లిస్తున్న బీజేపీ నేతలు ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడంలో ఫెయిల్ అవుతున్నారా? దక్షిణ తెలంగాణలో ప్రజా సంగ్రామయాత్ర చేసి ఊపుమీదున్నట్లు కనిపిస్తున్న బండి సంజయ్‌ ఉత్తర తెలంగాణలో జరిగిన ఈ రాజకీయ మార్పును పసిగట్టడంలో ఫెయిల్ అయ్యారా? లేదా చూస్తూ ఊరుకున్నారా అనే టాక్ వినిపిస్తోంది.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Web TitleBJP Fail on Operation Aakash in Telangana
Next Story