గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌లో బీజేపీ అత్యవసర సమావేశం.. ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష

BJP Meeting: వచ్చే ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం

Shekhar G
Published on: 6 July 2023 7:24 AM IST
BJP Emergency Meeting At Radisson Hotel Gachibowli
X

గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌లో బీజేపీ అత్యవసర సమావేశం.. ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష

BJP Meeting: గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతల అత్యవసర సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నియమితులైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది. ఈ భేటీకి ఈటల, లక్ష్మణ్‌, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌, జితేందర్‌రెడ్డి, విజయశాంతి, బాబుమోహన్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటనతో పాటు.. బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్షిస్తు్న్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తర్వాత.. ఢిల్లీ నుంచి మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చిన కిషన్‌రెడ్డికి.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. కిషన్‌రెడ్డికి ఈటల రాజేందర్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి కిషన్‌రెడ్డిని సన్మానించారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

Shekhar G

Shekhar G

Next Story