నేడు ఇందిరాపార్క వద్ద బీజేపీ మహాధర్నా

BJP: ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చిన హైకోర్టు````111

Dhatripriya
Updated on: 25 March 2023 8:45 AM IST
BJP Dharna At Indira Park today
X

నేడు ఇందిరాపార్క వద్ద బీజేపీ మహాధర్నా

BJP Dharna: ట్సప్స్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో రాష్ట్రప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. ఇవాళ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నా జరగనుంది. TSPSC పరీక్షల పేపర్‌ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున పోరాడేందుకు బీజేపీ దశలవారీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ నేతృత్వంలో ఇందిరాపార్క్‌ వద్దనిరుద్యోగులతో మా నౌకరీలు మాగ్గావాలే అనే నినాదంతో మహాధర్నా చేపట్టింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ధర్నా కొనసాగుతుంది. ధర్నాకు యువజన సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి నిచ్చింది. ధర్నాలో 500మంది మాత్రమే పాల్గొనాలని, రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేయోద్దని హైకోర్టు సూచించింది.

Dhatripriya

Dhatripriya

Next Story