ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు బీజేపీ డిమాండ్

*కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ

Rama Rao
Published on: 28 Oct 2022 5:16 PM IST
BJP Delegation Meets Election Commission of India | Telugu News
X

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు బీజేపీ డిమాండ్

BJP: ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు బీజేపీ డిమాండ్ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్‌సింగ్ కలిశారు. ఫామ్‌హౌజ్‌ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. టీఆర్‌ఎస్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని అరుణ్‌సింగ్ అన్నారు. మా పార్టీని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతుందనే భయంతో టీఆర్‌ఎస్ డ్రామాలు ఆడుతుందని అరుణ్‌సింగ్ అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story