ఎమ్మెల్సీ కవిత మండలి సభ్యత్వాన్ని రద్దు చేయండి…కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన బీజేపీ

X
Highlights
ఎమ్మెల్సీ కవిత శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ బీజేపీ లేఖ రాసింది. కవిత ...
Arun Chilukuri2 Dec 2020 12:44 PM GMT
ఎమ్మెల్సీ కవిత శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ బీజేపీ లేఖ రాసింది. కవిత అటు నిజామాబాద్ లో, ఇటు గ్రేటర్ ఎన్నికల్లో రెండిట్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కవిత బోధన్ నుంచి ఓటేశారని, నిన్నటి గ్రేటర్ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి ఓటేశారని బీజేపీ ఆరోపించింది. ఇలా రెండు చోట్ల నుంచి ఓటేయడం తప్పని తక్షణం కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఈ లేఖలో బీజేపీ ఈసీని కోరింది. ''నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను. మీరు బయటకు వచ్చి ఓటేయండి'' అని కవిత ట్వీట్ చేసినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.
Web TitleBjp Complaint On MLC Kavitha to CEC
Next Story