ఈ స్టేట్‌మెంట్‌తో కాంగ్రెస్ మోసపూరిత నిర్ణయాలు బయటపడ్డాయి : కృష్ణసాగర్‌రావు

X
Highlights
కాంగ్రెస్‌పై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా...
Arun Chilukuri6 Jan 2021 1:33 PM GMT
కాంగ్రెస్‌పై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చూసుకునేవాడినని.. ప్రణబ్ ముఖర్జీ రాసిన మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ 2012-17 బుక్‌లో చాలా స్పష్టంగా రాశారని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు వారికి ఇష్టం లేదనే విషయం చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రణబ్ మాత్రమే కాదు.. వారి పార్టీ అభిప్రాయం కూడా బయటపడిందన్నారు. ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో కాంగ్రెస్ కుటిల రాజనీతి, మోసపూరిత నిర్ణయాలు బయటపడ్డాయన్న కృష్ణసాగర్‌రావు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ క్షమాభిక్ష కోరాలని డిమాండ్ చేశారు.
Web TitleBJP chief spokesperson Krishna Saagar Rao fires on congress party
Next Story