KCR: రూల్స్‌ సామాన్యులకేనా.. మీకు వర్తించవా..కేసీఆర్‌పై బీజేపీ నేత ఆగ్రహం!

CM KCR at Hospital: యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు చికిత్సపై వివాదం

Sandeep Eggoju
Updated on: 22 April 2021 1:20 PM IST
BJP Chief Krishna Sagar Rao Comments that Corona Infected KCR did not Wear PPE kit to Yashoda Hospital
X

యశోద హాస్పిటల్ ముందు సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR at Hospital: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా చికిత్స కొనసాగుతోంది. నిన్న యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. టెస్టుల అనంతరం తిరిగి గజ్వేల్‌లోని ఫాంహౌస్‌కు తిరిగి వెళ్లిపోయారు సీఎం. అయితే ఈ ఘటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కరోనా సోకిన కేసీఆర్‌ పీపీఈ కిట్‌ ధరించకుండా, కనీస నిబంధనలు పాటించకుండా యశోద ఆస్పత్రికి రావడంపై మండిపడ్డారు బీజేపీ స్పోక్‌ పర్సన్‌ కృష్ణసాగర్‌రావు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు.

రూల్స్‌ పెట్టిన మీరే పాటించకపోతే ఇక సామాన్య ప్రజలు ఎలా ఫాలో అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణసాగర్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story