Bandi Sanjay: సర్కార్‌కు బండి డెడ్‌లైన్..

Bandi Sanjay: జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామన్నారు టీ.బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.

Arun Chilukuri
Updated on: 27 Dec 2021 7:35 PM IST
BJP Chief Bandi Sanjay Slams CM KCR in Nirudyoga Deeksha
X

Bandi Sanjay: సర్కార్‌కు బండి డెడ్‌లైన్..

Bandi Sanjay: జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామన్నారు టీ.బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. రాష్ట్రంలో లక్షా 92వేల ఖాళీలు ఉన్నాయన్నారు ఆయన. అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు (ఆర్‌ఆర్‌ఆర్‌) సభలో అడుగడుగునా ప్రభుత్వాన్ని అడ్డుకుంటారన్నారు. సభలో ఎమ్మెల్యేలు, బయట తమ పార్టీ శ్రేణులు, నిరుద్యోగ యువత అసెంబ్లీని నడవనీయబోమన్నారు. దేనికైనా తెగించి కొట్లాడతామని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ అంటే భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. తన దీక్షకు సంఘీభావం ప్రకటించిన ఓయూ విద్యార్థులతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కేసీఆర్‌కు భయపడే పార్టీ కాదన్నారు బండి సంజయ్‌. అర్ధరాత్రి సభలు, ర్యాలీలు నిషేధిస్తూ జీవో జారీ చేయడం సరికాదన్నారు బండి సంజయ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story