Bandi Sanjay: బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారు

Bandi Sanjay: కేసీఆర్‌ కుట్రతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది

Rama Rao
Published on: 9 April 2022 5:33 PM IST
BJP Chief Bandi Sanjay  Letter to Telangana Farmers | TS News Today
X

Bandi Sanjay: బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారు

Bandi Sanjay: తెలంగాణ రైతాంగానికి బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర దాగి ఉందని, బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్‌ గీసిందని, రైతుల నుంచి వచ్చే ఆగ్రహాన్ని కేంద్రం వైపు మళ్లించే ఎత్తుగడ వేశారని విమర్శించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమేనని లేఖలో తెలిపారు. రైతు పండించే ప్రతి గింజ కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న బండి సంజయ్ వడ్లను సేకరించి కేంద్రానికి అప్పగించకుండా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ డ్రామాలాడుతోందన్నారు. కేసీఆర్‌ కుట్రతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్న బండి సంజయ్ కేసీఆర్‌ కుట్రలను కలిసి ఛేదిద్దాం రండి అంటూ రైతులకు పిలుపునిచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story