TS BJP: తెలంగాణ ఎన్నికలకు 26 మందితో బీజేపీ కేంద్ర కమిటీ

TS BJP: అక్టోబర్‌ 5న తెలంగాణ ఎన్నికల కేంద్ర కమిటీతో సమావేశంకానున్న జేపీ నడ్డా

Shekhar G
Updated on: 28 Sept 2023 7:30 PM IST
BJP Central Committee With 26 Members For Telangana Elections
X

TS BJP: తెలంగాణ ఎన్నికలకు 26 మందితో బీజేపీ కేంద్ర కమిటీ

TS BJP: తెలంగాణ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌ పెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ చాపకింద నీరులా పనిచేస్తుంది. తెలంగాణ ఎన్నికల కోసం 26 మంది ముఖ్య నేతలతో బీజేపీ కేంద్ర కమిటీని ఏర్పటు చేసింది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం కమిటీలో చోటు కల్పించింది. కమిటీలో ఏపీ నుంచి సోమువీర్రాజు,విష‌్ణువర్ధన్‌రెడ్డిని నియమించారు. కమిటీలోని 26 మంది 8 మంది కేంద్రమంత్రులను జేపీ నడ్డా నియమించారు. ఈ కమిటీ ఎన్నికల ప్రచారం, అభ్యర్థులకు తోడ్పాటు, జాతీయ నేతల బహిరంగ సభల నిర్వహణ బాధ్యతలు నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణలో ఉండి పనిచేసేలా పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్‌ 5న తెలంగాణ ఎన్నికల కేంద్ర కమిటీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశంకానున్నారు.

Shekhar G

Shekhar G

Next Story