బీజేపీ కార్యాలయంలో ఘనంగా డా.శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ జయంతి

* శ్యామ్‌ప్రసాద్‌ చిత్రపటానికి నివాళులర్పించిన బండి సంజయ్‌

Rama Rao
Updated on: 6 July 2022 3:52 PM IST
BJP Celebrated Dr. Shyam Prasad Mukherjees Birth Anniversary
X

బీజేపీ కార్యాలయంలో ఘనంగా డా.శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ జయంతి

Bandi Sanjay: జమ్మూకశ్మీర్‌ భారత్‌లో భాగమని ఆనాడే పోరాడిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని మైనారిటీ సంతుష్ఠీకరణ నచ్చకే.. ఆయన బయటకు వచ్చారని చెప్పారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బండి సంజయ్‌ సహా పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆయన ఆశయాలు సాధించడానికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసి శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ ఆశయాన్ని ప్రధాని నెరవేర్చారన్నారు.


Rama Rao

Rama Rao

Next Story