Top
logo

దుబ్బాకలో మంత్రి ఎందుకు భయపడుతున్నారు : బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు

దుబ్బాకలో మంత్రి ఎందుకు భయపడుతున్నారు : బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు
X
Highlights

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఇదే సమయంలో పార్టీల మధ్య మాటల తూటాలు...

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఇదే సమయంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా మంత్రి పోలీసులను నడిపిస్తూ కుట్రపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. సోమవారం రోజున తూప్రాన్‌ వద్ద మూడు గంటల వరకు వాహనం తనిఖీ చేయకుండా నిలిపేశారని ఆయన అన్నారు. అదే విధంగా నిన్న రాత్రి కూడా అదే వాహనాన్ని 8 గంటల సమయంలో తనిఖీ పేరుతో ఆపారని ఆయన అన్నారు. అంతే కాకుండా దౌర్జన్యంగా ఫోన్ తీసుకొని అందులోని డాటాని పూర్తిగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారని తెలిపారు. ఆ తరువాత వాహనాన్ని తనిఖీ చేస్తున్న వీడియోలను తొలగించారని ఆయన అన్నారు.

రాత్రి 8 గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా వాహనాన్ని తనిఖీ చేసే టీమ్‌ రాలేదని ఆ తరువాత పోలీసులు అక్కడకు చేరుకొని కారును మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దుబ్బాకలో బీజేపీకి మంత్రిగారు ఎందుకు భయపడుతున్నారు..? 2014 నుంచి ఇప్పటిదాకా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఇవన్నీ కూడా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని రఘనందన్‌రావు తెలిపారు. మంత్రి హరీష్‌ రావు ఎల్కల్‌ గ్రామ సర్పంచ్‌తో మాట్లాడిన ఆడియో టేప్ కూడా మాదగ్గర ఉందని వాటిని కూడా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఇక మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. నామినేషన్లు వేసిన వారిలో ఇప్పటివరకు 46 దాఖలు కాగా, వారిలో 11 మంది ఉపసంహరించుకున్నారు. 34 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టైంది. మరో 12 నామినేషన్లు స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. కాగా మొత్తంలో ప్రస్తుతం 23 మంది దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది. 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు.

ఇక పార్టీ గుర్తుతో పోటీ చేస్తున్న వారిలో టీఆర్‌ఎస్‌ పార్టీ- సోలిపేట సుజాత, శ్రమజీవిపార్టీ- జాజుల భాస్కర్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా- సుకురి అశోక్, కాంగ్రెస్‌ పార్టీ- చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, అల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్- కత్తి కార్తీక, బీజేపీ- రఘు నందన్ రావు, ఇండియా ప్రజా బంద్ పార్టీ- సునీల్, జై స్వరాజ్- గౌట్ మల్లేశం ఉన్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తున్న వారిలో అండర్ఫ్ సుదర్శన్, బుట్టన్నగారి మాధవ రెడ్డి, కొట్టాల యాదగిరి ముదిరాజ్, అన్న బుర్ర రవి తేజ గౌడ్, కోట శ్యామ్ కుమార్‌, అన్న రాజ్, విక్రమ్ రెడ్డి వేముల, కంటే సాయన్న, పీఎం .బాబు, బండారు నాగరాజ్, మోతె నరేష్, వడ్ల మాధవాచారి, రణవేని లక్ష్మణ్‌ రావు, సిల్వెరి శ్రీకాంత్, రేపల్లె శ్రీనివాస్ ఉన్నారు.

Web TitleBJP candidate raghunandan rao spoke media over dubaka bypoll
Next Story