మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం

ఈసారి దేశంలో ప్రధాని మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

Shashank Gullapelli
Published on: 13 April 2024 8:02 AM IST
BJP candidate Etela Rajender campaigning in Malkajgiri
X

మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం 

Etela Rajender: రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది అతనికి ఓ కలగానే మిగిలిపోతుందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ ను నమ్మి పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి ప్రజలు తమ ఓటు హక్కును వృధా చేసుకోవద్దని సూచించారు. మల్కాజ్‌గిరి ప్రాంతంలో రహదారులు, స్కై వేలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఇతర అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. దేశం ప్రగతి శీలంగా ప్రశాంతంగా ఉండాలంటే మోడీ మరోసారి రావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

ప్రచారంలో భాగంగా ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ప్రియదర్శిని హోటల్ నుంచి దుబాయ్ గేటు వరకూ భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో లో తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, భాజాపాశ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 4 నెలలు అయినప్పటికీ హామీలు అమలు కాలేదని విమర్శించారు. 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, 420 హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలోనే హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ దేశం వ్యాప్తంగా ఎన్నికల వేళ ఇస్తున్న హామీలను ఏ విధంగా నెరవేరుస్తుందని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story