Telangana BJP: ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ భీం దీక్షలు

Telangana BJP: రాష్ట్ర కార్యాలయంలో లక్షణ్, రాజాసింగ్ ఆధ్వర్యంలో దీక్ష

Rama Rao
Updated on: 3 Feb 2022 6:46 AM IST
BJP Bhim Initiations Across Telangana Today | TS News Today
X

ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ భీం దీక్షలు 

Telangana BJP: రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోడిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు భీం దీక్ష చేపట్టనున్నారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీలో మౌన దీక్ష చేపడుతున్నారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావుతో పాటు పలువురు నేతలతో కలిసి దీక్ష చేయనున్నారు బండి సంజయ్. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించిన నిరసన తెలుపనున్నారు.

గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మండల కేంద్రాల్లో బీజేపీ భీం దీక్ష చేయనుంది. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు లక్ష్మణ్, రాజాసింగ్‌తో పాటు ముఖ్య నేతలు పాల్గొంటారు.

Rama Rao

Rama Rao

Next Story