టీఆర్ఎస్, కాంగ్రెస్ పై బండి సంజయ్ తీవ్రవిమర్శలు

Bandi Sanjay: కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉంది

Jyothi
Published on: 26 April 2022 7:57 AM IST
BJP Bandi Sanjay Fires TRS And Congress
X

టీఆర్ఎస్, కాంగ్రెస్ పై బండి సంజయ్ తీవ్రవిమర్శలు

Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా నారాయణ్ పేట జిల్లా మక్తల్ చేరుకున్న బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వం వెంటిలెటర్ పై ఉందని.. టీఆర్ఎస్ ను కూకటివేళ్లతో పెకిలిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయన్నారు. 31 ఎమ్మెల్యే సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు.

పీకే బ్రేక్ ఫాస్ట్ ఏఐసీసీలో.. లంచ్ ప్రగతి భవన్ లో డిన్నర్ ఫాంహౌజ్ లో చేస్తుంటాడని అన్నారు. కాంగ్రెస్ లో గెలిచినోడే ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. బీజీపీని ఒంటరిగా ఎదుర్కోనలేకని టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎఐఎం, కమ్యూనిస్టులు కుమ్మక్కవుతున్నాయన్నారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు ఇది చివరిపోరాటం కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. యువకులు ఏడాది పాటు బీజేపీ కోసం సమయం ఇవ్వాలని కోరారు. ఒక్క అవకాశంతో తెలంగాణ రూపు రేకలు మారుస్తామన్నారు బండి సంజయ్.

Jyothi

Jyothi

Next Story