మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై దాడి

X
Highlights
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూకట్‌పల్లి ఫోరం మాల్...
Arun Chilukuri1 Dec 2020 6:22 AM GMT
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూకట్‌పల్లి ఫోరం మాల్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు.. కారులో వచ్చి.. డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. డబ్బుతో దొరికితే కారును సీజ్ చేయకుండా పోలీసులు వదిలిపెట్టారని ఆరోపిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు. మంత్రి కాన్వాయ్‌ను వెంబడించి కారు అద్దాలు ధ్వంసం చేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
Web TitleBJP Activists Attack on Minister Puvvada Ajay
Next Story