Top
logo

తరుణ్‌ చుగ్‌కు ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు

తరుణ్‌ చుగ్‌కు ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు
X
Highlights

తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌కు ఘనస్వాగతం పలికారు రాష్ట్ర కార్యకర్తలు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా తీసుకొచ్చారు.

తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌కు ఘనస్వాగతం పలికారు రాష్ట్ర కార్యకర్తలు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా తీసుకొచ్చారు. అనంతరం పార్టీ ఆఫీస్‌లో కొత్తగా ఎంపికైన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు తరుణ్ చుగ్. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కార్పొరేటర్లతో భేటీ అనంతరం.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో తరుణ్‌ చుగ్‌ సమావేశం కానున్నారు. రేపు ఉదయం ఆఫీస్ బేరర్స్‌ సమావేశం అనంతరం ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.


Web TitleBJP activist warmly welcome Tarun Chugh
Next Story