Happy Birthday KTR: కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువ

Arun Chilukuri
Published on: 24 July 2020 10:48 AM IST
Happy Birthday KTR: కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువ
X

Happy Birthday KTR: తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు.

హ్యాపీ బర్త్ డే డియర్ తారక్. ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తితో ముందుకు సాగాలి అని మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు కేటీఆర్. నీవు ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలి అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేయగా, "బావా... చాలా కృతజ్ఞతలు" అని కేటీఆర్ స్పందించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ తన శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజా సేవలో మరిన్ని సంవత్సరాలు కేటీఆర్ కొనసాగాలని, ఇంకా పెద్ద పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు కేటీఆర్ తో కలిసి దిగిన చిత్రాన్ని సంతోష్ పంచుకున్నారు.







Arun Chilukuri

Arun Chilukuri

Next Story