బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ నిర్మాణంలో రాజీ పడ్డారు..అందుకే ప్రమాదాలు!


బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ నిర్మాణంలో లోపాల వల్లే వేగంగా వెళ్లే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని నిపుణుల కమిటీ అభిప్రాయం పడింది.
నిర్మాణంలో రాజీ పడటం వలెనే బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రానంతకంగా మారిందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. కొద్ది రోజుల క్రితం ఈ వంతెన పై నుంచి వేగంగా వెళుతున్న కారు కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా మృతి చెందింది. ఆ సమయంలో ఫ్లై ఓవర్ నిర్మాణ లోపాలపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ విషయంపై అధ్యయనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సోమవారం తన నివేదికను విడుదల చేసింది.
వంతెన నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో రాజీపడడం వల్లే, వంతెనలో ఎక్కువ వంపులు ఏర్పడ్డాయని కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనివల్లే ప్రమాదం జరిగిందని నివేదిక తేల్చింది. బ్రిడ్జి లోటుపాట్లపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో ప్రపంచ బ్యాంకు రోడ్డు భద్రత విభాగం అడ్వైజర్ ప్రొఫెసర్ నాగభూషణరావు, నిపుణులు డాక్టర్ టీఎస్ రెడ్డి, సహాయ ప్రొఫెసర్ శ్రీనివాస్‌కుమార్, ప్రదీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ కమిటీ తన నివేదికను జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌కు సమర్పించింది. ఈ లోపాల వల్ల బ్రిడ్జి డిజైన్ వేగంగా వెళ్లే వాహనదారులకు సురక్షితం కాదని నిపుణుల కమిటీ తేల్చింది. ముందుగా నిర్ణయించినట్లు ఈ ఫ్లైఓవర్‌పై వాహనాలు గంటకు 40 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనికోసం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇంజినీర్లు నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేయడంపైనే దృష్టి పెట్టారని, రెండు ప్రాణాంతకమైన మలుపులతో తక్కువ పొడవున్నఫ్లైఓవర్ ఎలాంటి దుష్పరిణామాలకు తావిస్తుందనే కోణంలో చర్యలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది.
స్ట్రేటజిక్ రోడ్స్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఎస్‌ఆర్డీపీ) కింద నిర్మించిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నవంబరు 4న అందుబాటులోకి వచ్చింది. ఖాజాగూడ జంక్షన్ నుంచి మైండ్‌స్పేస్ వరకూ వన్‌వేలో వెళ్లే వాహనాలకు మాత్రమే ఈ వంతెన పై నుంచి అనుమతి ఉంది. నవంబరు 9న కూడా ఓ ప్రమాదంలో ఇద్దరుయువకులు మరణించారు. అది జరిగిన కొద్ది రోజులకే 23న రెండో ప్రమాదం చోటు చేసుకుంది. 104 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఫోక్స్ వ్యాగన్ పోలో మలుపు వద్ద బ్రిడ్జి ప్రహరీని ఢీకొట్టి కింది రోడ్డు మీదకు పల్టీ కొట్టింది. అ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. కారు నడిపిన వ్యక్తి మాత్రం గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో బ్రిడ్జి డిజైన్‌లో లోపాలున్నాయని దుమారం రేగింది. దీంతో జీహెచ్ఎంసీ నిపుణులతో కమిటీ వేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

