హైదరాబాద్‌లో బైక్‌ చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు

Bike thefted thieves are Arrested in Hyderabad
x

Representational Image

Highlights

* నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్.. 38 వోగో బైక్‌లు స్వాధీనం * పరారీలో మరో ముగ్గురు నిందితులు * మెట్రో స్టేషన్ల దగ్గర వోగో బైక్‌లే టార్గెట్‌గా చోరీలు

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌కు చెక్ పెట్టారు సౌత్‌జోన్ టాస్క్‌‌ఫోర్స్‌ పోలీసులు. వోగో రెంటల్ సర్వీస్ టూవీలర్ వెహికిల్స్ టార్గెట్‌గా చోరీలు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 38 వోగో బైకులు, 16 నకిలీ పత్రాలు, 2 జీపియస్ ట్రాకర్లు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మెట్రో స్టేషన్ల దగ్గర ప్రయాణికుల సౌకర్యార్థం ఆధార్‌, డ్రైవింగ్‌ లెసెన్స్ ఆధారంగా వోగో బైక్‌లను ఆ సంస్థ అద్దెకు ఇస్తుంటుంది. జీపీఎస్‌ సాయంతో ప్రయాణికులు వీటిని ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది. అయితే ఈ బైక్‌ల పైనే కన్నేసింది ముఠా. మెట్రో స్టేషన్ల దగ్గర వోగో బైక్‌లను అద్దెకు తీసుకొని వాటి జీపీఎస్‌ ట్రాక్‌ను తొలగించి అమ్ముకుంటున్నారని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.

నకిలీ పత్రాలతో మెట్రో స్టేషన్ల దగ్గర వోగో బైక్‌లు రెంట్‌కు తీసుకుంటారు. ఆ తర్వాత తమ అడ్డాకు చేరుకొని వెహికల్స్‌ నుంచి జీపీఎస్‌ ట్రాక్‌ను తొలగిస్తారు. అనంతరం బైక్‌ రూపురేఖలు మార్చేసి అమ్ముకుంటున్నారని సీపీ తెలిపారు. వోగో సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ముఠా గుట్టురట్టు చేశారని అన్నారు. బైక్‌లను అద్దెకిచ్చే సంస్థలు టెక్నికల్‌గా మరింత అప్‌డేట్‌ కావాలని సూచించారు సీపీ అంజనీకుమార్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories