Boduppal: బోడుప్పల్‌లో ఎమ్మెల్యే మల్లారెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీ

Boduppal: పెద్దఎత్తున తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు, యువత

Jyothi
Published on: 5 Nov 2023 4:33 PM IST
Bike Rally in Support of MLA Malla Reddy in Boduppal
X

Boduppal: బోడుప్పల్‌లో ఎమ్మెల్యే మల్లారెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీ

Boduppal: మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డికి మద్దతుగా బోడుప్పల్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డికి మద్దతుగా ఆయన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డిలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటున్నారు. కాంగ్రెస్ హయాంలో 2 వందల రూపాయలు కూడా.. పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉండేదని విమర్శి్ంచారు. పదేళ్లలో ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందన్న ఆయన... కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story