సీఎం కేసీఆర్‌ ఆలోచన చాలా గొప్పది: బిహార్‌ సీఎం నితీష్‌

Bihar CM Nitish Kumar Praises CM KCR
x

సీఎం కేసీఆర్‌ ఆలోచన చాలా గొప్పది: బిహార్‌ సీఎం నితీష్‌ 

Highlights

Nitish Kumar: అమరుల కుటుంబాలను ఆదుకోవాలనే సీఎం కేసీఆర్‌ ఆలోచన చాలా గొప్పదని..

Nitish Kumar: అమరుల కుటుంబాలను ఆదుకోవాలనే సీఎం కేసీఆర్‌ ఆలోచన చాలా గొప్పదని, తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా నిలవాలనుకోవడం చాలా గొప్ప విషయమని కొనియాడారు బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఆయన అభినందించారు. ఇతర రాష్ట్రాల్లోనూ తమ కార్మికులకు ఇలాంటి సాయమే అందాలని ఆకాంక్షించిన నితీశ్ అమరుల కుటుంబాలకు కేంద్రమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కరోనా సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సాయం చేసిందని గుర్తుచేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలాగా స్పందించలేదన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణలో మిషన్‌ భగీరథ పథకం చాలా గొప్పదని, ఆ పథకాన్ని ఎలా చేశారో చూసి రావాలని బిహార్‌ అధికారులను పురమాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని గ్రామాల ప్రజలకు తాగునీరు అందించడం చాలా గొప్ప కార్యక్రమమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories