TS BJP: జీహెచ్‌ఎంసీలో బీజేపీకి భారీ షాక్

TS BJP: ప్రస్తుతం బాగ్‌ అంబర్‌పేట్‌ కార్పొరేటర్‌గా ఉన్న వెంకట్‌రెడ్డి భార్య పద్మ

Shekhar G
Published on: 22 Sept 2023 4:33 PM IST
Big Shock For TS BJP In GHMC
X

TS BJP: జీహెచ్‌ఎంసీలో బీజేపీకి భారీ షాక్

TS BJP: జీహెచ్‌ఎంసీలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సొంత పార్టీ నేతనే ఝలక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ బీజేపీ నగర మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కిషన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న వెంకట్‌రెడ్డి అంబర్‌పేట నుంచి పోటీ చేయాలని భావించారు. అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కిషన్‌రెడ్డిని వెంకట్‌రెడ్డి కోరారు. కిషన్‌రెడ్డి స్పందించకపోవడంతో వెంకట్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ రాజీనామా చేసే సమయంలో వెంకట్‌రెడ్డి దంపతులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వెంకట్‌రెడ్డి దంపతులు బీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం వెంకట్‌రెడ్డి భార్య పద్మ బాగ్‌ అంబర్‌పేట్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు.

Shekhar G

Shekhar G

Next Story